జెరూసలెం : ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న మెరుపు దాడులకు దిగిన హమాస్ ఫైటర్లు (Hamas Fighters) ఉత్తర కొరియా ఆయుధాలతో విరుచుకుపడ్డారనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయని చెబుతున్నారు. ఓ మిలిటెంట్ వీడియోతో పాటు ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇదే విషయం వెల్లడించాయి. కాగా, తాము మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు ఆయుధాలు విక్రయించలేదని ఉత్తర కొరియా చెబుతోంది.
యుద్ధక్షేత్రంలో వాడిన ఉత్తర కొరియా ఆయుధాలకు సంబంధించిన వీడియోను విశ్లేషించిన ఇద్దరు నిపుణులు హమాస్ ఎఫ్-7 రాకెట్ గ్రనేడ్‌తో పాటు, షోల్డర్ ఫైర్డ్ వెపన్స్‌ను వాడినట్టు పేర్కొంటున్నారు. ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తర కొరియా తన ఆయుధ కార్యక్రమాలకు నిధులు సమకూర్చే మార్గంగా అక్రమ ఆయుధాల రవాణా సాగిస్తోందనేందుకు ఈ ఆధారాలు సంకేతాలు పంపుతున్నాయి.
అత్యంత వేగంగా రీలోడ్ చేసే వెసులుబాటు ఉండటంతో రాకెట్ గ్రనేడ్ లాంఛర్లు గొరిల్లా దళాలకు విలువైన ఆయుధాలుగా మారుతున్నాయి. ఎఫ్-7ను సిరియా, ఇరాక్, లెబనాన్, గాజా స్ట్రిప్‌లో వాడుతున్నారని కన్సల్టెన్సీ ఆర్మామెంట్ రీసెర్చ్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేసే ఆయుధ నిపుణులు ఎన్ఆర్ జెంజెన్ జోన్స్ చెప్పుకొచ్చారు.
Read More :
Rishi Sunak | ఇజ్రాయెల్ వెన్నంటి నిలుస్తాం.. ఉగ్రవాదంపై పోరుకు మద్దతు : రిషీ సునాక్