Israel | ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. టెల్ అవివ్, హైఫా నగరాలపై దాడి
ఇజ్రాయెల్‌పై గాజా నుంచి హమాస్, లెబనాన్ నుంచి హెజ్బొల్లా, యెమెన్ నుంచి హౌతీ రాకెట్లవర్షం కురిపించాయి. టెల్ అవీవ్ నగరం లక్ష్యంగా హమాస్ రాకెట్లను ప్రయోగించింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని మూడో పెద్ద నగరమైన హైఫాను లక్ష్యంగా చేసుకొని హెజ్బొల్లా భారీ ఎత్తున రాకెట్లతో దాడి చేసింది.
- దాడి చేసిన హమాస్, హెజ్బొల్లా, హౌతీ
- దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
- ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి ఏడాది
Israel | జెరూసలేం, అక్టోబర్ 7: ఇజ్రాయెల్‌పై గాజా నుంచి హమాస్, లెబనాన్ నుంచి హెజ్బొల్లా, యెమెన్ నుంచి హౌతీ రాకెట్లవర్షం కురిపించాయి. టెల్ అవీవ్ నగరం లక్ష్యంగా హమాస్ రాకెట్లను ప్రయోగించింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని మూడో పెద్ద నగరమైన హైఫాను లక్ష్యంగా చేసుకొని హెజ్బొల్లా భారీ ఎత్తున రాకెట్లతో దాడి చేసింది. దక్షిణ హైఫాలోని ఇజ్రాయెల్ మిలిటరీ బేస్‌ను లక్ష్యంగా చేసుకొని ‘ఫది 1’ మిసైళ్లను ప్రయోగించినట్టు హెజ్బొల్లా ప్రకటించింది. తైబెరియాస్పై దాడి చేసినట్టు తెలిపింది. హెజ్బొల్లా ప్రయోగించిన రాకెట్లు హైఫాను తాకినట్టు ఇజ్రాయెల్ పోలీసులు ధ్రువీకరించారు. ఈ దాడిలో 10 మంది గాయపడ్డట్టు స్థానిక మీడియా తెలిపింది. అయితే, లెబనాన్ నుంచి హెజ్బొల్లా 135 రాకెట్లను ప్రయోగించగా, అడ్డుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. మధ్య ఇజ్రాయెల్ లక్ష్యంగా యెమెన్ నుంచి పేల్చిన క్షిపణిని సైతం అడ్డుకున్నట్టు పేర్కొన్నది. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై బాంబులు వేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలోని జబాలియా శరణార్థ శిబిరంతో పాటు పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 12 మంది పాలస్తీనా వాసులు మరణించారు. కాగా, ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 10 మంది అగ్నిమాపక సిబ్బంది సహా 22 మంది మరణించినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
గాజా పునర్నిర్మాణానికి దశాబ్దాలు
గాజాలో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచింది. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపి 1,200 మందిని హతమార్చడం, 251 మందిని బందీలుగా తీసుకెళ్లడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. హమాస్ దాడికి ప్రతీకారంగా వెంటనే గాజాపై ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులను ప్రారంభించింది. ఇవి ఏడాదికాలంగా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో గాజాస్ట్రిప్ చిన్నాభిన్నమైంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. తమ ఇండ్లు ఎక్కడున్నాయో కూడా ప్రజలు గుర్తుపట్టలేని స్థాయిలో విధ్వంసం జరిగింది. గాజా పునర్నిర్మాణానికి దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది. మరోవైపు హమాస్‌తో పాటు హెజ్బొల్లా, హౌతీలు, ఇరాన్ చేస్తున్న వైమానిక దాడులతో ఇజ్రాయెల్ సైతం నష్టపోతున్నది.
బందీలందరినీ వెనక్కు తీసుకొస్తాం: నెతన్యాహూ
అక్టోబర్ 7 దాడికి ఏడాది గడిచిన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలు అందరినీ వెనక్కు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ‘మన పిల్లలు, వారి భవిష్యత్తు కోసం అక్టోబర్ 7 లాంటి ఘటన మళ్లీ జరగకుండా చూసేందుకు మన ప్రాంతంలో భద్రత వాస్తవిక పరిస్థితులను మారుస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇరాన్ అణు పరీక్షలు?
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో అణ్వాయుధ తయారీ దిశగా ఇరాన్ ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా అణు పరీక్షలు జరిపిందని నిపుణులు భావిస్తున్నారు. అక్టోబరు 5న ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన భూకంపానికి అణుపరీక్షలే కారణమని అనుమానిస్తున్నారు. కాగా, ఊహించిన దాని కంటే వేగంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయగలదని తాజాగా ది హెరిటేజ్ ఫౌండేషన్ పేర్కొన్నది. ఇరాన్ చాలా ఏండ్లుగా అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తున్నప్పటికీ పాశ్చాత్య దేశాలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

