న్యూఢిల్లీ, మే 2: టెస్లా సీఈవో, ట్విట్టర్‌కు కాబోయే బాస్ ఎలాన్ మస్క్‌కు ట్విట్టర్ ఖాతా ఫాలోవర్లలో దాదాపు సగం వరకు నకిలీవని వెల్లడైంది. ట్విట్టర్ ఆడిటింగ్ టూల్ ‘స్పార్క్‌టోరో’ ప్రకారం రీసెర్చ్ ఆడిట్ సమయానికి మస్క్‌కు ఉన్న 8.79 కోట్ల ఫాలోవర్లలో 48 శాతం ఫేక్ అని తేలినట్టు మీడియా సంస్థ టైమ్ పేర్కొన్నది.
ఈ ఖాతాలు స్పామ్ అకౌంట్లు కావడమో లేదా ఎక్కువ కాలం యాక్టివ్‌గా లేనివిగా ఉన్నాయి. ఈ టూల్‌ను వినియోగించుకొని ట్విట్టర్ యూజర్ ఎవరైనా తన ఫాలోవర్ల ఖాతాల్లో ఎన్ని నకిలీవో తెలుసుకునేందుకు అవకాశం ఉన్నది.