H-1B Visa | టెక్ నిపుణులకు గుడ్‌న్యూస్.. హెచ్1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
H-1B Visa | అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులకు శుభవార్త. ఇకపై వారు హెచ్1బీ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అమెరికాలోనే వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు.
H-1B Visa | వాషింగ్టన్, డిసెంబర్ 19: అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులకు శుభవార్త. ఇకపై వారు హెచ్1బీ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అమెరికాలోనే వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు. ఇందుకు వీలుకల్పించే పైలట్ ప్రోగ్రామ్‌కు అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి నియంత్రణ సంస్థ ఓఐఆర్ఏ (ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ ఎఫైర్స్) ఈ నెల 15న ఆమోదం తెలిపింది.
మూడు నెలలపాటు అందుబాటులో ఉండే ఈ పైలట్ ప్రోగ్రామ్ కింద తొలుత 20 వేల మంది విదేశీయులకు హెచ్1బీ వీసాలను రెన్యువల్ చేస్తారు. దీంతో అమెరికాలో పనిచేస్తున్న ఎంతో మంది భారత టెక్ నిఫుణులకు లబ్ధి చేకూరుతుంది. అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా తప్పనిసరి. ఇప్పటివరకు ఈ వీసాలు పొందినవారు వాటిని పునరుద్ధరించుకునేందుకు స్వదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పైలట్ ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలోనే హెచ్1బీ వీసాల రెన్యువల్‌కు వీలుకల్పించడంతో విదేశీయులు తమ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

