అమెరికాలో మళ్లీ పేలిన తూటా

- కాల్పుల్లో ఎనిమిది మంది దుర్మరణం
- ఇండియానాపోలిస్‌లో ఘటన
- దుశ్చర్య అనంతరం దుండగుడి ఆత్మహత్య
వాషింగ్టన్, ఏప్రిల్ 16: తుపాకీ చప్పుళ్లతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. ఇండియానా పోలిస్‌లో గురువారం అర్ధరాత్రి ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇండియానా పోలిస్ విమానాశ్రయానికి సమీపంలోని ఫెడ్ఎక్స్ కొరియర్ సంస్థ వద్ద ఈ ఘటన జరిగింది. ఘాతుకానికి పాల్పడిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని మరణించినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన ఐదుగురిని దవాఖానకు తరలించినట్టు చెప్పారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసు ప్రతినిధి గానె కుక్ పేర్కొన్నారు. తమ సంస్థలో పనిచేసే వారుకూడా మృతుల్లో ఉన్నట్టు ఫెడ్ఎక్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని కుక్ పేర్కొన్నారు. చేతిలో రైఫిల్‌ను పట్టుకొని వచ్చిన దుండగుడు కనిపించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా, ఈ ఏడాది అమెరికాలో జరిగిన మూడు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 20 మందికి పైగా మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

