Greta Thunberg | ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసన.. గ్రెటా థన్‌బర్గ్ అరెస్ట్
Greta Thunberg | గాజాపై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ డెన్మార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) ను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అరెస్టయ్యింది.
Greta Thunberg : గాజాపై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ డెన్మార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) ను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అరెస్టయ్యింది. స్టూడెంట్స్ అగైనెస్ట్ ది ఆక్యుపేషన్ అనే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలను దిగ్బంధించారు.
ఇజ్రాయెల్ యూనివర్సిటీలను బహిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాలస్తీనాపై దాడులు కొనసాగుతున్న సమయంలో కోపెన్హాగన్ విశ్వవిద్యాలయం ఇజ్రాయిల్ విశ్వవిద్యాలయాలతో సహకరించడం నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, గ్రెటా అరెస్ట్‌పై పోలీసులు స్పందించలేదు.
యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో జరిగిన కార్యక్రమంలో కేవలం ఆరుగురిని మాత్రమే అరెస్టు చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. క్యాంపస్ ప్రవేశ ద్వారాన్ని మూసివేశామని, అరెస్టు చేసిన వారి పేర్లను వెల్లడించలేమని అన్నారు. అయితే అదుపులోకి తీసుకున్న వారిలో గ్రెటా కూడా ఉన్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ధృవీకరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

