నిశ్చలత్వంతో శ్మశాన నిశ్శబ్దం ఆవరించి మౌనరోదన చేస్తున్నట్టు కనిపిస్తున్న ఈ చిత్రం ఉత్తర కాలిఫోర్నియాలోని చారిత్రాత్మక గ్రీన్విల్లే పట్టణానిది. చారిత్రాత్మక వస్తువులకు, కళలకు కాణాచిగా నిలిచిన ఈ నగరంలోని చర్చిలు, మ్యూజియంలు, హోటళ్లు, వందకుపైగా ఇండ్లు గత మూడువారాలుగా విజృంభిస్తున్న కార్చిచ్చుకు నిలువెల్లా కాలిపోయాయి. బూడిదగా మారిన ఒకప్పటి గోల్డ్ రష్ సిటీ.. ప్రస్తుతం నిర్జీవ సాక్ష్యంగా కనిపిస్తూ అందరి మనసుల్ని మెలిపెడుతున్నది.