Journalism AI| జర్నలిజం ఏఐ! వార్తా కథనాలు రాసే గూగుల్ ఏఐ టూల్
న్యూఢిల్లీ: వార్తా కథనాలు రాయడంలో జర్నలిస్టులకు సహాయపడేలా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏఐ టూల్స్‌ను వినియోగించేలా వివిధ వార్తాసంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.
Journalism AI| న్యూఢిల్లీ: వార్తా కథనాలు రాయడంలో జర్నలిస్టులకు సహాయపడేలా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏఐ టూల్స్‌ను వినియోగించేలా వివిధ వార్తాసంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఆ మీడియా సంస్థల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన న్యూస్ కార్ప్‌తో గూగుల్ సంప్రదింపులు జరుపుతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
హెడ్‌లైన్స్ పెట్టడంలోనూ, విభిన్నంగా వార్తాకథనాలు రాయడంలోనూ జర్నలిస్టులకు ఈ ఏఐ టూల్స్ సహకరిస్తాయని, తద్వారా వారి పనితీరు మెరుగుపడేలా చేస్తాయని గూగుల్ తెలిపింది. జర్నలిస్టులకు ఈ టూల్ పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుందని పేర్కొన్నది. ఈ ఏఐ టూల్‌కు ‘జెనెసిస్’ అని పేరు పెట్టినట్టు సమాచారం. న్యూస్‌లో జెనరేటివ్ ఏఐని వినియోగించేందుకు చాట్‌జీపీటీ యాజమాన్య సంస్థ ఓపెన్ఏఐతో జట్టుకట్టనున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో గూగుల్ ఈ కొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ సంస్థ బార్డ్ పేరుతో ఏఐ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

