Golden Visa | ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదిగేందుకు.. గోల్డెన్ వీసాపై సంపన్నుల చూపు
అంతర్జాతీయ పెట్టుబడులు, నిపుణులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం ఇస్తున్న గోల్డెన్ వీసాలకు భారత్లో క్రేజ్ పెరుగుతున్నది. ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదిగేందుకు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ యూఏఈ గోల్డెన్ వీసా కోసం ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య ఎక్కువవుతున్నది.
- భారతీయ ధనికులను ఆకర్షిస్తున్న గోల్డెన్ వీసా
- టాలెంట్, డబ్బులు ఉంటే పిలిచి ఇస్తున్న యూఏఈ
- దక్కిందంటే దుబాయి బాట పట్టేందుకు సిద్ధం
- ఆర్థిక, వృత్తిపరంగా ఎదిగేందుకు అవకాశాలు
Golden Visa | దుబాయి, ఆగస్టు 16: అంతర్జాతీయ పెట్టుబడులు, నిపుణులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం ఇస్తున్న గోల్డెన్ వీసాలకు భారత్లో క్రేజ్ పెరుగుతున్నది. ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదిగేందుకు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ యూఏఈ గోల్డెన్ వీసా కోసం ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య ఎక్కువవుతున్నది. వివిధ రంగాల్లో నిపుణులు, పెట్టుబడులు పెట్టగలిగిన వారికి యూఏఈ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతిస్తున్నది.
స్వయంగా వచ్చి గోల్డెన్ వీసాలను అందిస్తున్నది. దీంతో భారత్ నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడేందుకు సిద్ధమవుతున్న సంపన్నుల్లో చాలామందికి గమ్యస్థానంగా యూఏఈ మారుతున్నది. అంతర్జాతీయ పెట్టుబడి వలసల కన్సల్టెన్సీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ జూన్ నివేదిక ప్రకారం 2024లో 4,300 మంది భారతీయ సంపన్నులు దేశం వీడనున్నారు. వీరిలో చాలామంది గోల్డెన్ వీసా తీసుకొని యూఏఈలో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు.
గోల్డెన్ వీసా ఎవరికి ఇస్తారు ?
- యూఏఈ వైద్య శాఖ, వివిధ శాస్త్రవేత్తల కమిటీల అనుమతితో వైద్యులు, శాస్త్రవేత్తలకు ఈ వీసా ఇస్తారు.
- సాంస్కృతిక, కళల విభాగం అనుమతితో కళాకారులకు, కళా రంగాల నిపుణులు గోల్డెన్ వీసా పొందొచ్చు. ఎక్కువగా మలయాళీ నటులు ఈ వీసా తీసుకుంటున్నారు.
- డిగ్రీ పట్టా, ఐదేండ్ల పని అనుభవం, కనీసం 50 వేల అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్ల(ఏఈడీ)(రూ.11,42,808) నెలవారీ జీతం ఉన్న ఉద్యోగులు గోల్డెన్ వీసాకు అర్హులు.
- 20 లక్షల దిర్హమ్లు ప్రభుత్వానికి డిపాజిట్ చేసి, 2.50 లక్షల దిర్హమ్లు పన్ను రూపంలో కట్టి యూఏఈలో వ్యాపారాన్ని స్థాపించాలనుకునే పెట్టుబడిదారులకు ఈ వీసా ఇస్తారు.
- ఐదు లక్షల దిర్హమ్ల విలువైన వ్యాపారం ఉన్న వ్యాపారవేత్తలు కూడా గోల్డెన్ వీసాలు పొందొచ్చు.
గోల్డెన్ వీసాతో ప్రయోజనాలు ఏంటి ?
యూఏఈ ప్రభుత్వం 2019 నుంచి గోల్డెన్ వీసాలు ఇవ్వడం ప్రారంభించింది. అధికారిక వెబ్సైట్ ప్రకారం గోల్డెన్ వీసా పొందిన వారికి అనేక సదుపాయాలు కలుగుతాయి.
- వీరికి స్థానిక స్పాన్సర్ లేనప్పటికీ దీర్ఘకాలం యూఏఈలో నివసించేందుకు అనుమతి లభిస్తుంది.
- యూఏఈలోని ఏడు ఎమిరేట్లు అబుదాబీ, అజ్మన్, దుబాయి, ఫుజైరాహ్, రాస్ అల్ ఖైమా, షార్జా, ఉమ్ అల్ కువైన్లో ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటూ జీవించవచ్చు.
- గోల్డెన్ వీసా ఉంటే ఎప్పుడైనా యూఏఈకి సులువుగా వెళ్లిరావచ్చు.
- వ్యాపారవేత్తలకు అనువైన అనేక సౌలభ్యాలు కలుగుతాయి. స్థాపించే వ్యాపారాలపై పూర్తి యాజమాన్య హక్కు ఉంటుంది.
- గోల్డెన్ వీసా ఉన్న వారు కుటుంబసభ్యులు, కార్మికులు యూఏఈకి వచ్చేందుకు స్పాన్సర్ చేయవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

