వాషింగ్టన్: యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్)కు చెందిన శాన్ డియాగో కార్యాలయాల్లో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు వెళ్లిన వారిని అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు అరెస్ట్ చేస్తున్నాయి. వారికి బేడీలు వేస్తున్నాయి.
అమెరికన్ పౌరుల భార్య/భర్తలకు కూడా ఈ పరిస్థితి తప్పడం లేదు. తన క్లయింట్ గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకు వెళ్లినపుడు అరెస్ట్ చేసి, చేతులకు బేడీలు వేశారని ఓ న్యాయవాది చెప్పారు. ఇమిగ్రేషన్ అటార్నీ సమన్ నసేరీ మాట్లాడుతూ, వీసా గడువు మీరినప్పటికీ అమెరికాలో ఉంటున్న వారిని అరెస్ట్ చేయడం ఏజెన్సీలు ప్రారంభించాయన్నారు.