జంతువులు ఒకదానిపై ఒకటి నిస్వార్థమైన ప్రేమను ప్రదర్శించడాన్ని మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు ప్రతిసారీ మన హృదయాలను ద్రవింపజేస్తాయి. జిరాఫీ ఆపదలో ఉన్న ఓ జింకకు సహాయం చేస్తున్న హృదయపూర్వక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది.
ఈ వీడియోను ‘యోడాఫర్ఎవర్’ అనే యూజర్ ట్వటర్లో షేర్ చేశారు. ఓ జింక పిల్ల తలపై కొమ్ములకు చెట్టుకొమ్మ ఇరుక్కోవడంతో నడిచేందుకు ఇబ్బందిపడుతూ ఉంటుంది. ఇదిచూసిన జిరాఫీ దాని దగ్గరకు వచ్చి ఆ కొమ్మను తొలగిస్తుంది. దీంతో ఆ జింకపిల్ల చెంగుచెంగున అక్కడినుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ మిలియన్ వ్యూస్ వచ్చాయి. 55వేల మంది లైక్ చేశారు.
Giraffe removes branch stuck on gazelle’s head…🦌🦒💪 pic.twitter.com/mNT5yNXf18
— 𝕐o̴g̴ (@Yoda4ever) June 24, 2022