ఈ సీసా ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. ఇందులో 311 లీటర్ల స్కాచ్ విస్కీ పడుతుంది. ఇంట్రెపిడ్ అనే బ్రాండ్ కింద తయారు చేసిన ఈ సీసాలో 444 ఫుల్ బాటిళ్లు పడతాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ సీసాలో ప్రతిష్ఠాత్మక మెకాలాన్ వైన్ కంపెనీ తయారు చేసిన 32 ఏండ్లనాటి స్కాచ్ నింపినప్పుడు గిన్నిస్ రికార్డు బద్దలైంది.
గత బుధవారం ల్యోన్ అండ్ టర్న్‌బుల్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ భారీ సీసా 14 లక్షల డాలర్ల ధర పలికింది. అంటే మన కరెన్సీలో 11.2 కోట్ల రూపాయల పైనే.