Frankfurt | ఫ్రాంక్‌ఫర్ట్‌లో కుంభవృష్టి.. పూర్తిగా నీటమునిగిన విమానాశ్రయం.. రద్దయిన విమానాలు
జర్మనీలోని (Germany) ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం (Thunderstorms) కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి.
ఫ్రాంక్ఫర్ట్: జర్మనీలోని (Germany) ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం (Thunderstorms) కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. ఆకస్మిక వరదలతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇక దేశంలో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టు (Frankfurt airport) స్విమ్మింగ్‌పూల్‌ను తలపిస్తున్నది. గంటల వ్యవధిలోనే కురిసిన భారీ వానతో విమానాశ్రయంలో పెద్దఎత్తున నీరు చేరింది. రన్‌వేలను వరద నీరు ముంచెత్తింది. దీంతో అధికారులు విమాన సర్వీసులను రద్దుచేశారు. ఫ్రాంక్‌ఫర్ట్‌కు వచ్చే విమానాలను ఇతర నగరాలకు మళ్లించారు.
భారీగా వర్షం కురుస్తుండటంతో వేలాది మంది విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. ఇక టేకాఫ్ అవడానికి సిద్ధమైన లుఫ్తాన్సా విమానంలో ఒక్కసారిగా వచ్చిన వరదతో నిలిచిపోయింది. దీంతో కొన్నిగంటల పాటు ప్రయాణికులు అందులోనే ఉండిపోయారు. ఇక నగరంలోని రోడ్లన్నీ నీట మునగడంతో వాహనదారుల తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని మళ్లిస్తున్నారు. కాగా, మరికొన్ని గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని లోకల్ వెదర్ సర్వీస్ విభాగం వెల్లడించింది. స్వల్ప వ్యవధిలోనే చదరపు మీటర్‌కు 25 నుంచి 40 లీటర్ల వర్షం కురుస్తుందని తెలిపింది.




Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

