జర్మనీలో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్
జర్మనీ| దేశంలో మరో నెల రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని జర్మనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి కొవిడ్ టీకాలు ఇస్తామని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వెల్లడించారు.

బెర్లిన్: దేశంలో మరో నెల రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని జర్మనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి కొవిడ్ టీకాలు ఇస్తామని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వెల్లడించారు. అయితే పిల్లలు కరోనా టీకాలు వేయించుకోవడం తప్పనిసరి కాదని ఆమె స్పష్టం చేశారు. 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఫైజర్ లేదా బయోఎంటెక్ కొవిడ్ టీకాలు ఇవ్వడానికి యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ శుక్రవారం ఆమోదించనుంది. ఇప్పటికే 16 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఓకే చెప్పింది.
జూన్ 7వ తేదీ నుంచి 12, అంతకు పైబడిన పిల్లలు లేదా యువత టీకాల కోసం నమోదు చేసుకోవచ్చని మెర్కెల్ చెప్పారు. కొత్త విద్యాసంవత్సరానికి ముందు ఆగస్టు నాటికి పిల్లలకు కొవిడ్ టీకా మొదటి డోసు ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లలకు టీకాలు వేయడం ద్వారా వారిలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెప్పారు. కెనడా, అమెరికాల్లో ఇప్పటికే 12 ఏళ్ల వయసు పైగా పిల్లలకు టీకాలు వేస్తున్నారు.
కాగా, కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, గాలి ఆడేలా గదులను ఉంచుకోవాలని మెర్కెల్ సూచించారు. దేశంలో ఇప్పటివరకు 40 శాతానికిపైగా మంది తొలి డోసు వేయించుకున్నారని, మరో 15 శాతం మంది రెండు డోసులు వేయించుకున్నారని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

