భారతీయులకు వీసా-ఫ్రీ ట్రాన్సిట్ సౌకర్యం.. జర్మనీ ప్రకటన
తమ దేశంలోని విమానాశ్రయాల మీదుగా ప్రయాణించే భారతీయ పాస్పోర్టు హోల్డర్లకు వీసా-ఫ్రీ ట్రాన్సిట్ సౌకర్యాన్ని జర్మనీ సోమవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: తమ దేశంలోని విమానాశ్రయాల మీదుగా ప్రయాణించే భారతీయ పాస్పోర్టు హోల్డర్లకు వీసా-ఫ్రీ ట్రాన్సిట్ సౌకర్యాన్ని జర్మనీ సోమవారం ప్రకటించింది. ఈ చర్యతో భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణం సులభతరం కావడమేగాక రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పటిష్టం చేసే అవకాశం ఉంది.
ఈ నెల 12-13న జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ భారత పర్యటన సందర్భంగా ప్రకటన వెలువడింది. ఇది మెర్జ్ భారత తొలి పర్యటనేగాక జర్మనీ చాన్సలర్గా ఆసియాకు మొదటి సందర్శన. వీసా-ట్రాన్సిట్ సౌకర్యం వల్ల జర్మనీ మీదుగా వేరే దేశానికి ప్రయాణించే భారతీయ ప్రయాణికులు విడిగా ట్రాన్సిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవలసిన అవసరం ఉండదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

