Georgian Airways | ‘మా విమానాల్లో ప్రయాణించొద్దు’.. ఏకంగా దేశ అధ్యక్షురాలిపై బ్యాన్ విధించిన ఎయిర్‌లైన్ సంస్థ
Georgian Airways | ఒక జాతీయ ఎయిర్‌లైన్ సంస్థ ఏకంగా ఆ దేశ అధ్యక్షురాలిపై బ్యాన్ విధించింది. తమ విమానాల్లో ప్రయాణానికి ఆమెను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆ ఎయిర్‌లైన్‌ను బహిష్కరిస్తామని దేశ అధ్యక్షురాలు బెదిరించడంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.
టిబిలిసి: ఒక జాతీయ ఎయిర్‌లైన్ సంస్థ ఏకంగా ఆ దేశ అధ్యక్షురాలిపై బ్యాన్ విధించింది. తమ విమానాల్లో ప్రయాణానికి ఆమెను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆ ఎయిర్‌లైన్‌ను బాయ్‌కాట్ చేస్తామని దేశ అధ్యక్షురాలు బెదిరించడంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. ఆసియా, ఐరోపా మధ్య ఉన్న జార్జియా దేశంలో ఈ సంఘటన జరిగింది. జార్జియాకు నేరుగా విమాన ప్రయాణాలపై నాలుగేళ్ల కిందట విధించిన నిషేధాన్ని రష్యా ఈ నెలలో ఎత్తివేసింది. అలాగే రష్యాకు ప్రయాణించే జార్జియన్లకు దశాబ్దాల నాటి వీసా అవసరాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ జాతీయ ఎయిర్‌లైన్ సంస్థ జార్జియన్ ఎయిర్వేస్ (Georgian Airways) రష్యాకు విమాన సేవలను పునరుద్ధరించింది.
కాగా, రష్యా చొరవను అడ్డుకోవాలని, ఆ దేశానికి అనుకూలంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జార్జియా అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచ్విలి పిలుపునిచ్చారు. అలాగే రష్యాకు విమాన సర్వీసులను పునరుద్ధరించిన జార్జియన్ ఎయిర్వేస్ను ఆమె విమర్శించారు. ఆ సంస్థను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అయితే అధ్యక్షురాలి మాటను అక్కడి ప్రభుత్వం లెక్కచేయలేదు. రష్యాకు విమాన సేవలను పునరుద్ధరించిన జార్జియన్ ఎయిర్వేస్ను అడ్డుకోలేదు.
మరోవైపు ప్రైవేట్ యాజమాన్యానికి చెందిన జార్జియన్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు తమజ్ గయాష్విలి, అధ్యక్షురాలి స్టేట్మెంట్పై తీవ్రంగా స్పందించారు. సలోమ్ జౌరాబిచ్విలి నిషేధిత వ్యక్తి అని పేర్కొన్నారు. జార్జియన్ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పేవరకు తమ విమానాల్లో ఆమె ప్రయాణంపై బ్యాన్ విధించినట్లు తెలిపారు. అయితే ఆ దేశ అధ్యక్షురాలు దీనిపై ఇంకా స్పందించలేదని రష్యాకు చెందిన టాస్ వార్తా సంస్థ పేర్కొంది.
కాగా, విమాన ప్రయాణాలపై రష్యా నిషేధం ఎత్తివేతపై జార్జియాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రష్యా నిర్ణయాన్ని మెజార్టీ జార్జియా ప్రజలు, ప్రభుత్వ అధికారులు స్వాగతించారు. కొందరు మాత్రం రష్యాను వ్యతిరేకిస్తూ ఐరోపా యూనియన్‌కు మద్దతుగా ఆ దేశ రాజధాని టిబిలిసిలో నిరసన ప్రదర్శనలు చేశారు. అలాగే ఆ దేశంలోని ఐదో వంతు భూభాగం రష్యా సైన్యం ఆధీనంలో ఉండటంపై గళమెత్తారు.
మరోవైపు రష్యాతో సంబంధాల పునరుద్ధరణకు జార్జియా ప్రభుత్వం చొరవ చూపుతున్నది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు విధించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో జార్జియా ప్రభుత్వం, ఆ దేశ అధ్యక్షురాలైన సలోమ్ జౌరాబిచ్విలి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయితే కేవలం అధికార కార్యక్రమాల ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యే అధ్యక్షురాలి మాటను జార్జియా ప్రభుత్వం లెక్కచేయడం లేదు. ఐరోపా సమైఖ్యతో సంబంధాలు దెబ్బతింటాయన్న ఆమె హెచ్చరికను పట్టించుకోకుండా రష్యాతో సంబంధాల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

