దిగ్బంధంలో గాజా
హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా దిగ్బంధంలో చిక్కుకున్నది. అత్యంత జనసాంద్రత ఉండే గాజాలో 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు.
- బిక్కుబిక్కుమంటున్న 20 లక్షల మంది
గాజా, అక్టోబర్ 8: హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా దిగ్బంధంలో చిక్కుకున్నది. అత్యంత జనసాంద్రత ఉండే గాజాలో 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు. రెండు దేశాలు జల, వాయు, గగనతలాల్లో ఆయుధాలను మోహరించడంతో ఇప్పుడు వారంతా బిక్కుబిక్కుమంటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఎటునుంచి మృత్యువు వస్తుందో తెలియక చావు భయంతో నరకయాతన అనుభవిస్తున్నారు. గాజాకు తూర్పు, ఉత్తర భాగాల్లో ఇజ్రాయెల్, దక్షిణాన ఈజిప్టు, పశ్చిమ భాగంలో మధ్యదరా సము ద్రం సరిహద్దులుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరుదేశాలు జల, వాయు, భూ దిగ్బంధాన్ని విధించాయి. దీంతో గాజా వాసులు ఎటువెళ్లలేని పరిస్థితి నెలకొంది. గతంలో 2005-06లో తాత్కాలికంగా, 2007లో శాశ్వతంగా ఇలా గాజా దిగ్బంధంలో చిక్కుకుంది. కాగా, 2007లో గాజాను హస్తగతం చేసుకున్న నాటి నుంచి ఈ 15 ఏండ్లలో ఇజ్రాయెల్‌పై హమాస్ ఐదుసార్లు దాడులకు దిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Egypt
- Gaza strip
- Israel Hamas
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

