Israel War | చిన్నారులకు మరుభూమిలా గాజా..! ఆందోళన వ్యక్తం చేసిన యూఎన్ చీఫ్ గుటెర్రెస్
Israel War | ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఈ యుద్ధం మొదలై నెలరోజులు కావొస్తున్నది. హయాస్ ప్రారంభించిన అనధికారిక యుద్ధం ఇప్పటికీ ఆగిపోయే పరిస్థితుతుల కనిపించడం లేదు. దాదాపు 11వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Israel War | ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఈ యుద్ధం మొదలై నెలరోజులు కావొస్తున్నది. హయాస్ ప్రారంభించిన అనధికారిక యుద్ధం ఇప్పటికీ ఆగిపోయే పరిస్థితుతుల కనిపించడం లేదు. దాదాపు 11వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ప్రతిదాడులతో గాజా స్ట్రిప్‌లో పరిస్థితి మరింత దిగజారుతున్నది. ఈ క్రమంలో గాజాలోని పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా చిన్నారులకు శ్మశాన వాటికలా మారుతోందన్నారు. గాజా పరిస్థితి మానవతా సంక్షోభం కంటే ఎక్కువ అని.. ఇది మానవత్వం సంక్షోభమన్నారు.
కాల్పుల విరమణ అవసరమని.. ప్రతి గంటకు మరింత అత్యవసరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం గాజాలో అమానవీయ ఘటనలను ఆపాలని, అలాగే మానవతా సహాయాన్ని విస్తరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఎన్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా శరణార్థుల (UNRWA) కోసం పనిచేస్తున్న 89 మంది మరణించారని యూఎన్ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. యూఎన్ చరిత్రలో ఇటీవల వారాల్లో అత్యధిక సంఖ్యలో యూఎన్ కార్యకర్తలు చంపబడ్డారన్నారు. యుద్ధంలో కనీసం 26 మంది వరకు గాయపడ్డారని, మరికొందరు గల్లంతయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

