Mexico firing | మెక్సికోలో గ్యాంగ్స్టర్స్ కాల్పులు.. మేయర్ సహా 18 మంది హతం
Mexico firing |మెక్సికోలో గ్యాంగ్స్టర్స్ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో టెటెలెపాన్ సిటీ మేయర్ దారుణహత్యకు గురయ్యారు. దుండగులు జరిపిన కాల్పుల్లో పలువురు పోలీసులు సహా మొత్తం 18 మంది చనిపోయారు.
Mexico firing | దక్షిణ మెక్సికోలో ఓ గ్యాంగ్స్టర్స్ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో టోటోలెపాన్ నగర మేయర్ కొనార్డో మెన్డోజాతో సహా 18 మంది హతమయ్యారు. కాల్పుల ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నగరంలో సైన్యాన్ని మోహరించారు.
పోలీసుల కథనం ప్రకారం, మెక్సికోలోని శాన్ మగుల్ టెటెలెపాన్ సిటీ హాల్లో గురువారం దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 18 మంది చనిపోయినట్లుగా తెలుస్తున్నది. మేయర్ కొనార్డో మోన్డోజా కూడా చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. కొందరు పోలీసు సిబ్బంది కూడా చనిపోయినట్లుగా సమాచారం. దుండగులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించడంతో సిటీ హాల్ పరిసరాల్లో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మెక్సికన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది.
కాల్పుల సంఘటనకు ముందు దుండగులు మేయర్ మోన్డోజా తండ్రి, మాజీ మేయర్ జాన్ అకోస్టాను సిటీ హాల్లోకి తీసుకెళ్లి దారుణంగా హతమార్చినట్లు తెలుస్తున్నది. లాస్ టెకోలోర్స్ ముఠా ఈ కాల్పులకు తెగించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు ఈ ముఠా టెటెలోపాన్కు తిరిగి వచ్చినట్లు ప్రకటించిందని పోలీసులు చెప్తున్నారు. కాగాచ మెక్సికో సిటీలో 15 రోజుల వ్యవధిలో ఇది మూడో కాల్పుల సంఘటన. సెప్టెంబర్ 21న గ్వాన్జాటోలో జరిగిన దాడిలో 10 మంది చనిపోగా.. అక్టోబర్ 2న జెపోపెన్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

