Volcano | లావా వెదజల్లుతున్న అగ్నిపర్వతంపై తాడు కట్టి.. దానిపై వట్టి కాళ్లతో నడిచిన ఫ్రెండ్స్!
Volcano | అగ్నిపర్వతాలు బద్దలవడం అంటే మనకు తెలుసు. వీటికి సంబంధించిన వీడియోలు చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. యాక్టివ్ అగ్నిపర్వతాలతో ఉండే ప్రమాదమే ఇది. అవి ఎప్పుడు బద్దలవుతాయో ఎవరూ చెప్పలేరు.
అగ్నిపర్వతాలు బద్దలవడం అంటే మనకు తెలుసు. వీటికి సంబంధించిన వీడియోలు చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. యాక్టివ్ అగ్నిపర్వతాలతో ఉండే ప్రమాదమే ఇది. అవి ఎప్పుడు బద్దలవుతాయో ఎవరూ చెప్పలేరు. వాటిలో చిన్న చిన్న పేలుళ్లు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అందుకే చాలా మంది యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతాలకు కూడా వెళ్లరు.
కానీ ఈ ఇద్దరు స్నేహితులు మాత్రం అందుకు భిన్నం. స్వతహాగా ఎడ్వంచరర్స్ అయిన రఫేల్ జుగ్నో, అలెగ్జాండర్ షూల్జ్ మంచి మిత్రులు. ఏదైనా అడ్వెంచర్ చెయ్యాలనే ఆశతో అత్యంత ప్రమాదకరమైన ఫీట్‌ను ఎంచుకున్నారు వీళ్లు. నైరుతి పసిఫిక్ సముద్రంలో ఉన్న టన్నా దీవిలో ఒక యాక్టివ్ అగ్నిపర్వతం ఉంది. దాని పేరు యాసుర్.
దీనిపైన ఒక తాడు కట్టి, ఆ తాడుపై వట్టి కాళ్లతో నడవాలన్నది ఈ స్నేహితుల ఆలోచన. వింటేనే భయమేస్తోంది కదా. కానీ వీళ్లిద్దరూ ఆ ఫీట్ చేశారు. అగ్ని పర్వతం క్రేటర్‌కు 42 మీటర్ల ఎత్తులో తాడును కట్టి వీళ్లు నడిచారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 856 అడుగుల దూరం ప్రయాణించారు. దీంతో వీరి పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదైంది.
వీళ్ల డేంజరస్ ఫీట్‌కు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హ్యాండిల్లో పోస్టు చేయగా నెటిజన్లు షాకైపోయారు. ఈ వీడియోలో ఒకానొక సందర్భంలో స్నేహితులు ఆ తాడుపై నడుస్తుండగా.. వారి వెనుకనే అగ్ని పర్వతంలో పేలుడు జరిగి, లావా బాగా ఎత్తుగా లేచి పడటం కనిపిస్తోంది.
‘ఒక యాక్టివ్ వోల్కనోపై అత్యంత దూరం స్లాక్‌లైన్ నడక రికార్డు’గా దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించింది. ఇది చూసిన నెటిజన్లు ‘ఇది కదా రికార్డు అంటే’ అని కామెంట్లు చేస్తున్నారు. ‘ఇంత కాలానికి ఒక నిజమైన రికార్డు చూశా. హ్యాట్సాఫ్’ అని మరొకరు కామెంట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

