France riots | ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. ప్యారిస్ మేయర్ ఇంటిపై ఆందోళనకారుల దాడి
ఫ్రాన్స్‌లో (France) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత మంగళవారం మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్‌ను ట్రాఫిక్ పోలీసులు కాల్చిచంపడంతో మొదలైన అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి.
ప్యారిస్: ఫ్రాన్స్‌లో (France) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత మంగళవారం మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్‌ను ట్రాఫిక్ పోలీసులు కాల్చిచంపడంతో మొదలైన అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు వందలు, వేలమంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఎదురొచ్చిన వాహనానికల్లా నిప్పు పెడుతున్నారు. ఆందోళనకారుల ఆగ్రహానికి ఇప్పటికే 2,500 వాహనాలు బూడిదయ్యాయి. వందలకొద్దీ షాపులు, మాల్స్ ధ్వంసమయ్యాయి. వరుసగా ఐదో రోజు కూడా ఆందోళనలతో ఫ్రెంచ్ దేశం దద్దరిల్లింది.
ఈ క్రమంలో ఆందోళనకారులు ప్యారిస్ (Paris) టౌన్ మేయర్ ఇంటిపై దాడిచేశారు (Attack). ఆదివారం రాత్రి నగర మేయర్ విన్సెంట్ జీన్బ్రన్ (Mayor Vincent Jeanbrun) ఇంట్లోకి ఓ కారు దూసుకెళ్లింది. అంతటితో ఆగని నిరసనకారులు (Protesters) ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో ఆయన భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు విన్సెంట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రాత్రి తన ఇంట్లోకి కొందరు నిరసనకారులు కారుతో దూసుకొచ్చారని, ఇంటి నిప్పుపెట్టారని చెప్పారు. తమపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు.

గత ఐదురోజులుగా కొనసాగుతున్న అల్లర్లలో.. పోలీసులు ఇప్పటివరకు 4 వేల మంది నిరసనకారులను అరెస్టు చేశారు. అయినా, నిరసనలు ఆగటం లేదు. నిరసనకారులంతా టీనేజర్లేనని పోలీసులు చెప్తున్నారు. శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.
జాతి వివక్షపై పోరేనా?
ఫ్రాన్స్‌లో తాజా అల్లర్లు గత ఏడాది అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపిన తర్వాత చెలరేగిన అల్లర్లను తలపిస్తున్నాయి. పోలీసులు నడిరోడ్డుపై మెడపై మోకాలుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేయటంతో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయాడు. ఊపిరాడటం లేదని అతడు మొత్తుకున్నా పోలీసులు కనికరం చూపలేదు. ఇప్పుడు ఫ్రాన్స్‌లో చనిపోయిన నాహెల్ కూడా ఆఫ్రికా నుంచి వలస వచ్చిన అరబ్ మూలాలున్న నల్లజాతీయుడే. అతడు ముస్లిం మతానికి చెందినవాడు. దీంతో ఫ్రాన్స్‌లోని నల్లజాతీయులంతా తీవ్ర ఆగ్రహంతో నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలు దశాబ్దాలుగా పాతుకుపోయిన జాతి వివక్షపై తిరుగుబాటు అని ప్రచారం అవుతున్నది. సోషల్‌మీడియాలో కూడా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ హోరు కొనసాగుతున్నది. నాహెల్ తల్లి కూడా తన కుమారుడు నల్లజాతీయుడు కాబట్టే పోలీసులు కాల్చిచంపారని ఆరోపించారు.
Cette nuit, un cap a été franchi dans l'horreur et l'ignominie. Mon domicile a été attaqué et ma famille victime d'une tentative d’assassinat.
Ma détermination à protéger et servir la République est plus grande que jamais. Je ne reculerai pas. #PasPourRien #Emeutes ⤵️ pic.twitter.com/9HW1eAFCXN
— Vincent Jeanbrun (@VincentJeanbrun) July 2, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

