పారిస్: ఫ్రాన్స్‌లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచాలని అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ ప్రణాళికలు వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. సుమారు 8 ఉద్యోగ సంఘాలు ఈ ధర్నాలో పాల్గొంటున్నాయి. దీంతో స్కూళ్లు, రవాణా, ఆయిల్ రిఫైనరీ సేవల్లో అంతరాయం ఏర్పడింది.
ఈ నెల ఆరంభంలో కూడా తొలిసారి మేజర్ ఉద్యోగ సంఘాలు ధర్నా చేపట్టాయి. మళ్లీ రెండోసారి ఆ సమ్మెలో ఉద్యోగ సంఘాలు పాల్గొంటున్నాయి. ప్రైమరీ స్కూళ్లకు చెందిన సగం మంది టీచర్లు ధర్నా చేస్తున్నారు. పెన్షన్ వయసు సంస్కరణలు చేపట్టాలన్న ఆలోచనతో మాక్రన్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు అంచనా వేస్తున్నారు.