ఇక అక్కడ మాస్క్ తప్పనిసరి కాదు..
మాస్క్| బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరనే నిబంధనను కూడా నేటి నుంచి ఎత్తివేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రధాని జీన్ కేస్టెక్స్ ప్రకటించారు. కేసుల్లో తగ్గుదల కనిపిస్తుండటంతో ముందుగా నిర్ణయించినదానికంటే 10 రోజుల ముందుగానే కర్ఫ్యూని కూడా రద్దుచేయనున్నట్లు చెప్పారు.

పారిస్: గతేడాది కరోనా విజృంభణతో గజగజ వణికింది ఫ్రాన్స్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో తొలి ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయితే కరోనా ఫస్ట్ వేవ్ క్రమంగా తగ్గిపోయింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో టీకా పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంతో కొత్తగా నమోదవుతున్న కేసులూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తున్నది. ఇప్పటికే లాక్డౌన్ ఎత్తివేసింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరనే నిబంధనను కూడా నేటి నుంచి ఎత్తివేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రధాని జీన్ కేస్టెక్స్ ప్రకటించారు. కేసుల్లో తగ్గుదల కనిపిస్తుండటంతో ముందుగా నిర్ణయించినదానికంటే 10 రోజుల ముందుగానే కర్ఫ్యూని కూడా రద్దుచేయనున్నట్లు చెప్పారు.
కొన్ని మినహాయింపులతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని ఎత్తివేస్తున్నామని కేస్టెక్స్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20 కరోనా కర్ఫ్యూని కూడా ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉందని వెల్లడించారు. కాగా, దేశంలో ఆరోగ్య పరిస్థితులు తాము అంచనాదానికంటే మెరుగ్గా ఉందని తెలిపారు. ఈ వేసవి చివరినాటికి 35 మిలియన్ల మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇది దేశ జనాభాలో సగానికంటే అధికమని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

