France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
France Protests | ఫ్రాన్స్ (France) లో నిరసనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ధరల పెరుగుదల, దుర్భర జీవన వ్యయం వంటి సమస్యలపై ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు (France Protests) జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో భాగంగా ఫ్రాన్స్‌లోని సిటీ హాళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలు, వేలాది వాణిజ్య సంస్థలపై ఉద్యమకారులు దాడులకు పాల్పడుతున్నారు.
France Protests : ఫ్రాన్స్ (France) లో నిరసనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ధరల పెరుగుదల, దుర్భర జీవన వ్యయం వంటి సమస్యలపై ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు (France Protests) జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో భాగంగా ఫ్రాన్స్‌లోని సిటీ హాళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలు, వేలాది వాణిజ్య సంస్థలపై ఉద్యమకారులు దాడులకు పాల్పడుతున్నారు. దాంతో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూలు విధించాల్సి వచ్చింది.
అయినప్పటికీ అల్లర్లు ఆగడం లేదు. తీవ్రమవుతున్న ఈ ఆందోళనల్లో చేరడానికి అమెరికా నుంచి కొంతమంది యా క్టివిస్టులు, తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు (US Radicals) పారిస్‌కు వెళ్లినట్లు అగ్ర రాజ్యానికి చెందిన మీడియా సంస్థలు సంచలన కథనాలను వెలువరించాయి. వాటి ప్రకారం.. అల్లర్లలో పాల్గొనడానికి మిన్నెసోటా నుంచి ఓ ర్యాపర్ ఇటీవల ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అంతటితో ఆగకుండా పారిస్‌లో బీభత్సం సృష్టించాలని సోషల్ మీడియా వేదికగా శ్వేత జాతీయులకు పిలుపునిచ్చాడు.
అమెరికాలోనూ ఇటువంటి నిరసనలు లేవనెత్తాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తంచేశాడు. మరోవైపు అమెరికాకు చెందిన కోడ్ పింక్ అనే సంస్థ ఫ్రాన్స్‌ను ఆదర్శంగా తీసుకొని అగ్రరాజ్యంలోనూ ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 10 నుంచి 12 మధ్య వాషింగ్టన్లో ‘పన్ను చెల్లింపుదారుల తిరుగుబాటు’ నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా సుమారు 2,500 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారుల దాడుల్లో దాదాపు 1,000 మంది అధికారులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
అల్లర్లపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ.. తమ దేశంలో నెలకొన్న హింసకు తీవ్రవాద వామపక్ష బృందాలకు చెందిన తిరుగుబాటుదారులు, నేరగాళ్లు కారణమని ఆరోపించారు. ఫ్రాన్స్‌లో నిరసనలకు వలసదారులే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన నేపథ్యంలో మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన విషయమని చెప్పవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

