Donald Trump: జార్జియా ఎన్నికల్లో జోక్యం.. ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదు
Donald Trump: డోనాల్డ్ ట్రంప్‌పై నాలుగో నేరాభియోగం నమోదు అయ్యింది. జార్జియా రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకున్నట్లు ట్రంప్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2020 దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ట్రంప్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే తాజా కేసులో ట్రంప్‌తో పాటు మరో 18 మందిపై కూడా నేరాభియోగాలు నమోదు అయ్యాయి.
వాషింగ్టన్ డీసీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)పై నేరాభియోగాలు నమోదు అయ్యాయి. 2020 దేశాధ్యక్ష ఎన్నికల్లో జార్జియా రాష్ట్ర ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని నెలల్లో ట్రంప్‌పై నమోదు అయిన నాలుగు క్రిమినల్ కేసు ఇది. రాబోయే అధ్యక్ష ఎన్నికలపై కన్నేసిన రిపబ్లికన్ నేత ట్రంప్‌తో పాటు మరో 18 మందిపై తాజా కేసులో నేరాభియోగాలు నమోదు అయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు, అనవసరంగా జోక్యం చేసుకున్నట్లు ట్రంప్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే తనపై నమోదు అయిన 13 అభియోగాలను ట్రంప్ ఖండించారు. రాజకీయ కక్షతో ఆ ఆరోపణలు చేసినట్లు ఆయన తెలిపారు.
జార్జియా ప్రాసిక్యూటర్ ఫాని విల్లిస్ తన తీర్పును వెలువరించారు. ఆ రాష్ట్ర ఎన్నికల్లో జోక్యం చేసుకున్న అంశంపై 2021 ఫిబ్రవరిలో ఆమె దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిపై 98 పేజీల రిపోర్టును ఆమె తయారు చేశారు. సోమవారం ఆ తీర్పును ప్రకటించారు. ఆగస్టు 25వ తేదీలోగా సరెండర్ కావాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు.
జార్జియా ఎన్నికల అధికారితో ట్రంప్ మాట్లాడినట్లు ఓ ఫోన్ కాల్ రికార్డు లీకైంది. తనకు మరో 11,780 ఓట్లు కావాలని, ఆ ఓట్లు దక్కేలా ఎలాగైనా చూడాలని జార్జియా అధికారిని ట్రంప్ కోరినట్లు ఆ రికార్డులో సంభాషణ ఉన్నది. ఆ ఫోన్ రికార్డు కారణంగానే జార్జియా కేసులో ప్రాసిక్యూటర్ విచారణ చేపట్టారు. అయితే కీలకమైన ఆ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ గెలుస్తుందని ఆశించినా.. చివరకు బైడెన్ పార్టీ ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

