హఫీజ్ ఇంటి సమీపంలో పేలుడు.. విదేశీయుడు అరెస్ట్
పాకిస్తాన్ | పాకిస్తాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు కేసులో

లాహోర్: పాకిస్తాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు కేసులో పీటర్ పాల్ డేవిడ్ అనే విదేశీయుడిని గురువారం లాహోర్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసిన పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ వెల్లడించింది. అరెస్టు చేసిన అనంతరం అతన్ని రహస్య ప్రదేశానికి తరలించి విచారించినట్లు దునియా టీవీ పేర్కొన్నది. అయితే పేలుడుకు ఉపయోగించిన కారు డేవిడ్దే అని విచారణలో తేలినట్లు డాన్ తెలిపింది. ఈ పేలుడు ఘటన కంటే ముందు డేవిడ్ కరాచీ, లాహోర్, దుబాయికి తరుచుగా ప్రయాణించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో అతను ఈ మూడు ప్రదేశాలకు ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో సంభవించిన పేలుడు ధాటికి ముగ్గురు మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ నగరంలోని జోహర్ పట్టణంలో హఫీజ్ నివాసానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఈ పేలుడు చోటుచేసుకుంది.
పేలుడు ధాటికి సమీపంలోని ఇండ్లు, వాహనాలు కూడా ధ్వంసమైనట్లు లాహోర్ పోలీసులు తెలిపారు. గాయపడిన 21 మందిలో ఓ పోలీస్ అధికారి సహా మహిళలు, చిన్నారులు ఉన్నారని, గాయపడ్డ వారిని జిన్నా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

