గుడ్‌న్యూస్.. ఆ వ్యాక్సిన్లకు ట్రయల్స్ అవసరం లేదు

న్యూఢిల్లీ: ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వివిధ దేశాలు, డబ్ల్యూహెచ్ అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు ఇండియాలో మళ్లీ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫైజర్, మోడెర్నాలాంటి వ్యాక్సిన్లకు లైన్ క్లియర్ కానుంది. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే నష్టపరిహారం, ట్రయల్స్ నిర్వహించడం వంటి వాటిని ఎత్తేయాలని కోరాయి. దేశంలో వ్యాక్సిన్లకు ఉన్న డిమాండ్, భారీగా పెరిగిపోతున్న కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీసీజీఐ చీఫ్ వీజీ సోమానీ వెల్లడించారు.
కొవిడ్-19 వ్యాక్సిన్ల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం డీసీజీఐకి ఈ సిఫారసు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీసుకున్న వ్యాక్సిన్లు, యూఎస్ ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ, జపాన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ యూజ్ లిస్ట్‌లో ఉన్న వ్యాక్సిన్లకు ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని నిర్ణయించినట్లు సోమానీ ఒక లేఖలో తెలిపారు. గతంలో విదేశాల్లో ట్రయల్స్ పూర్తి చేసి అనుమతి పొందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ లేదా పరిమిత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడా నిబంధనను ఎత్తేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

