Russia Invansion | స్విఫ్ట్ నుంచి ఆ బ్యాంకులు ఔట్.. ఏటీఎంల వద్ద రష్యన్ల బారులు
Russia Invansion | రష్యన్ బ్యాంకులను స్విఫ్ట్ వ్యవస్థ నుంచి తొలగించడంతో రష్యన్లు బ్యాంకుల ఏటీఎంల వద్ద క్యాష్ కోసం బారులు తీరారు.
Russia Invansion | ఉక్రెయిన్‌పై దండయాత్ర చేపట్టిన రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు, యూరోపియన్ యూనియన్, రంగంలోకి దిగాయి. రష్యా బ్యాంకులను గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్.. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్సియల్ టెలీ కమ్యూనికేషన్స్ (స్విఫ్ట్) సేవలను తొలగించేశాయి. దీంతో రష్యన్లలో ఆందోళన పెరిగింది. వందల మంది రష్యన్లు తమ బ్యాంకుల ఏటీఎంల వద్ద బారులు తీరారు. గ్లోబల్ పేమెంట్ సిస్టమ్.. స్విఫ్ట్ నుంచి రష్యా బ్యాంకులను తొలగించడంతో ఆ దేశ అంతర్జాతీయ వాణిజ్యం సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
అమెరికా తర్వాత స్విఫ్ట్ సేవలను వినియోగించుకుంటున్న వారిలో రష్యన్లు రెండో స్థానంలో ఉంటారు. దాదాపు 300 రష్యా ఆర్థిక సంస్థలు స్విఫ్ట్ సేవలతో అనుసంధానమయ్యాయి. తాజాగా స్విఫ్ట్ సిస్టమ్‌ను పశ్చిమ దేశాలు తొలగించడంతో రష్యన్లకు అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు జరుపడం కష్టతరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లో 11 వేలకు పైగా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా అంతర్జాతీయ చెల్లింపులు జరుపుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Britain
- Russian Banks
- Swift
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

