అమెరికాలో ఆసియన్లపై కాల్పులు
ఎనిమిది మంది మృతి.. వారిలో నలుగురు మహిళలు
దేశంలో కరోనా వ్యాప్తికి కారణమన్న అపోహతో దుశ్చర్య
అట్లాంటా/ఫినిక్స్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి ఆసియా దేశాలకు చెందిన వారే కారణమన్న విద్వేషంతో జరుగుతున్న దాడుల్లో మరో దారుణం సంభవించింది. మూడు మసాజ్ పార్లర్లలో విచ్చలవిడిగా ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. వీరిలో ఆరుగురు ఆసియన్లే. వీరిలో నలుగురు దక్షిణ కొరియా మహిళలు. జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలోని రెండు పార్లర్లలో, అట్లాంటాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వుడ్‌స్టాక్‌లోని మరో పార్లర్లో మంగళవారం సాయంత్రం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న 21 ఏండ్ల రాబర్ట్ ఆరోన్ లాంగ్‌ను పోలీసులు గాలించి పట్టుకున్నారు.
ఫినిక్స్‌లో కాల్పులు… నలుగురి మృతి
అమెరికాలోని ఫినిక్స్‌లో ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. కాల్పులకు కారణం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. విస్కాన్సిన్లోని గోడౌన్లో జరిగిన మరో ఘటనలో ఓ కార్మికుడు కాల్పులు జరపడంతో తోటి కార్మికులు ఇద్దరు మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

