Hostel Fire: న్యూజిలాండ్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
Hostel Fire: కివీస్ హాస్టల్లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. వెల్లింగ్టన్లో ఈ ఘటన జరిగింది. దాదాపు 11 మంది మిస్సయ్యారు. ఈ ఘటన పట్ల న్యూజిలాండ్ ప్రధాని విచారం వ్యక్తం చేశారు.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని నాలుగు అంతస్థుల హాస్టల్(Hostel Fire) భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో 11 మంది మిస్సింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్ అగ్నిప్రమాద ఘటన దారుణమని, ఇది విషాదాన్ని నింపినట్లు ప్రధాని క్రిస్ హిప్కిన్స్ తెలిపారు.
హాస్టల్లో 92 రూమ్‌లు ఉన్నాయి. నిర్మాణ రంగం, హాస్పిటల్ స్టాఫ్, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు కూడా ఆ హాస్టల్లో బస చేస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల తమ వస్తువులన్నీ కోల్పోయినట్లు కొందరు చెప్పారు. హాస్టల్లో 52 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద ఘటనపై అనుమానాలు ఉన్నట్లు ఫైర్ అండ్ ఎమర్జెన్సీ అధికారులు చెబుతున్నారు.
అనేక మంది డిపోర్టీలు ఆ హాస్టల్లో ఉంటున్నారని, చాలా మంది మిస్సైనట్లు తెలుస్తోందని అడ్వకేట్ ఫిలిపా పెయిన్ తెలిపారు. లోఫర్స్ లాడ్జ్ టాప్ ఫ్లోర్లో అర్థరాత్రి తర్వాత అగ్నిప్రమాదం జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

