ఎయిర్ రేస్‌లో కుప్పకూలిన జెట్.. వీడియో
Jet crash:అమెరికాలోని నెవడాలో జరుగుతున్న రీనో ఎయిర్ రేస్ షోలో విషాదం చోటుచేసుకుంది. ఫైనల్స్ కోసం పోటీపడుతున్న ఓ జెట్ విమానం.. అదుపు తప్పి నేలపై కుప్పకూలింది. కూలిన సమయంలో భారీ స్థాయిలో మం
నెవడా: అమెరికాలోని నెవడాలో జరుగుతున్న రీనో ఎయిర్ రేస్ షోలో విషాదం చోటుచేసుకుంది. ఫైనల్స్ కోసం పోటీపడుతున్న ఓ జెట్ విమానం.. అదుపు తప్పి నేలపై కుప్పకూలింది. కూలిన సమయంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. విమాన భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో రిలీజైంది. జెట్ విమానం నేలను తాకిన తర్వాత అగ్నిగోళం తరహాలో దట్టమైన మంటలు వ్యాపించాయి. రీనో ఎయిర్ రేస్‌లో భాగంగా చివరి రోజు జరుగుతున్న చాంపియన్‌షిప్ రౌండ్లో ఈ ప్రమాదం జరిగింది. జెట్ గోల్డ్ రేస్‌లోని మూడవ ల్యాప్ జరుగుతున్నప్పుడు జెట్ కూలింది. ఈ ఘటనలో ఆ జెట్ విమాన పైలట్ మృతిచెందాడు. జెట్ పేలిన ఘటన తర్వాత ఆ రేస్‌కు సంబంధించిన ఈవెంట్లను రద్దు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Jet Crash
- Nevada
- Reno Air Race
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

