Federal Reserve: బ్యాంకులు సంక్షోభంలో ఉన్నా.. వడ్డీ రేట్లను పెంచిన అమెరికా
Federal Reserve:ఏడాది కాలంలోనే తొమ్మిదోసారి వడ్డీ రేట్లను పెంచింది అమెరికా రిజర్వ్ బ్యాంక్. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ఈ చర్య తప్పదన్నారు. ఇటీవల ఆ దేశంలోని రెండు మేజర్ బ్యాంక్‌లను మూసివేసిన విషయం తెలిసిందే.
న్యూయార్క్: అమెరికాలో బ్యాంకు వడ్డీ రేట్లు(Interest rates) మళ్లీ పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్(Federal Reserve) బ్యాంక్.. వడ్డీ రేట్లను 0.25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు పేర్కొన్నది. ఒకవైపు ద్రవ్యోల్బణం.. మరోవైపు బ్యాంకుల మూసివేత లాంటి కష్టాలు ఉన్నా.. దిక్కుతోచని స్థితిలో ఉన్న అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచేసింది. అయితే ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉన్నట్లు ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. కానీ బ్యాంకులు దివాళా తీయడం వల్ల .. రాబోయే కొన్ని నెలల్లో ఆర్ధిక వృద్ధి(economic growth)పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు ఆ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ధరలను నియంత్రించే ఉద్దేశంతో వడ్డీ రేట్లను పెంచినట్లు ఫెడరల్ బ్యాంక్ పేర్కొన్నది. గత ఏడాది కాలంలో వడ్డీ రేట్లను పెంచడం ఇది తొమ్మిదో సారి.
ఇంట్రెస్ట్ రేటును పెంచడం వల్లే.. గత ఏడాది కాలంలో అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఆ నేపథ్యంలోనే రెండు మేజర్ బ్యాంకులను మూసివేయాల్సి వచ్చింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్(silicon valley bank), సిగ్నేచర్ బ్యాంక్‌లను గత నెలలో ఫెడరల్ రిజర్వ్ మూసివేసిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్లు పెంచడం వల్ల బ్యాంకుల వద్ద ఉన్న బాండ్ల విలువ తగ్గే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుందని ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమీ పావెల్(Jerome Powell) తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

