మొట్టమొదటి టీకాగా రికార్డు
న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఫైజర్ టీకాకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ సోమవారం పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది. కరోనా వైరస్ను నిరోధించడానికి ఈ వ్యాక్సిన్ను ఇప్పుడు మార్కెటింగ్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్న కరోనా టీకాలు అన్ని అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చినవే. పూర్తి స్థాయి అనుమతులు వచ్చిన మొదటి టీకా ఫైజరే. గతేడాది డిసెంబర్ 11న ఎఫ్డీఏ ఫైజర్ టీకాకు అత్యవసర వినియోగం కింద అనుమతినిచ్చింది.