Donald Trump: డాక్టర్ ఫౌసీని ఎందుకు తొలగించలేదు? ఈ ప్రశ్నకు ట్రంప్ ఏమన్నారంటే
Donald Trump: ఫౌసీని ఎందుకు విధుల నుంచి తప్పించలేదన్న దానిపై మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమాధానం ఇచ్చారు. హగ్ హెవిట్ నిర్వహించే రేడియో షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాన్ని తెలిపారు. తన ప్రభుత్వంలో డాక్టర్ ఫౌసీ పెద్ద వ్యక్తేమీ కాదు అని ట్రంప్ అన్నారు.
వాషింగ్టన్: అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంధోనీ ఫౌసీ అందరికీ తెలిసిందే. కరోనా ఉదృతి సమయంలో ఆయనకు, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మధ్య మాటల యుద్ధం సాగింది. ఫౌసీ చెప్పింది ట్రంప్ వినలేదు, ట్రంప్ చెప్పింది ఫౌసీ పట్టించుకోలేదు. నిజానికి ఆ సమయంలో అమెరికా ప్రజల్ని గందరగోళానికి గురి చేశారు. ఫౌసీ ఇచ్చిన సలహాల్ని ట్రంప్ ఆమోదించలేదు. ఫౌసీని వ్యతిరేకించడం వల్లే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను ప్రజలు ఓడించినట్లు ఊహాగానాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఫౌసీని ఎందుకు విధుల నుంచి తప్పించలేదన్న దానిపై మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమాధానం ఇచ్చారు. హగ్ హెవిట్ నిర్వహించే రేడియో షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
తన ప్రభుత్వంలో డాక్టర్ ఫౌసీ పెద్ద వ్యక్తేమీ కాదు అని ట్రంప్ అన్నారు. ఆ మెడికల్ అడ్వైజర్‌ను ఎందుకు ఫైర్ చేయలేదన్న అంశంపై కూడా సమాధానం ఇచ్చారు. సివిల్ సర్వీస్ వ్యక్తిని తొలగించేందుకు అనుమతి లేదని ట్రంప్ తెలిపారు. అయినా అది పెద్ద విషయం కాదు అని, అతను చెప్పిన ప్రతి అంశాన్ని తానేమీ పట్టించుకోలేదన్నారు. డాక్టర్ ఫౌసీ చాలా విషయాలు చెప్పేవారని, కానీ చాలా వరకు కేసుల్లో తానేమీ స్పందించకపోయేవాడినన్నారు. తన పరిపాలన సమయంలో ఫౌసీ పెద్ద వ్యక్తి ఏమీ కాదన్నారు. కానీ బైడెన్ సర్కార్‌లో మాత్రం అతను కీలకంగా మారినట్లు ట్రంప్ వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

