Israel vs Iran | ‘అవి తప్పుడు వార్తలు, ఏ మాత్రం నిజం లేదు’.. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఖండించిన ఇజ్రాయెల్
Israel vs Iran | శాంతి చర్చల్లో పాల్గొన్న ఇరాన్ (Iran) కీలక నేతలను ఇజ్రాయెల్ (Israel) సైన్యం హత్య చేయాలనుకున్నట్లు అమెరికా మీడియా (US Media) ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని, అందులో ఏమాత్రం నిజం లేదని ప్రధాని బెంజామిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) కార్యాలయం స్పష్టంచేసింది.
Israel vs Iran : శాంతి చర్చల్లో పాల్గొన్న ఇరాన్ (Iran) కీలక నేతలను ఇజ్రాయెల్ (Israel) సైన్యం హత్య చేయాలనుకున్నట్లు అమెరికా మీడియా (US Media) ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని, అందులో ఏమాత్రం నిజం లేదని ప్రధాని బెంజామిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) కార్యాలయం స్పష్టంచేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ (Abbas Araghci), పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్‌లను హత్య చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రణాళిక వేసుకుందని న్యూయార్క్ టైమ్స్ (NewYork time) తన కథనంలో పేర్కొంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్‌లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని, ఈ విషయాన్ని ముందే పసిగట్టిన అమెరికా.. ఇరాన్‌కు సమాచారం అందించిందని న్యూయార్క్ టౌమ్స్ పత్రిక వెల్లడించింది. అయితే ‘ఇజ్రాయెల్, ఇరాన్ చర్చల ప్రతినిధులపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన తాజా కథనం పూర్తిగా కల్పితం. వాస్తవాలకు ఏమాత్రం దగ్గరగా లేదు’ అని ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ స్పందించింది.
ఏప్రిల్‌లో ప్రారంభమైన శాంతి చర్చల సమయంలో ఇరాన్ నేతలపై దాడి జరిగితే చర్చలు పూర్తిగా భగ్నమవుతాయని అమెరికా భావించిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ కథనం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో ఇజ్రాయెల్ స్పందించాల్సి వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

