మెటాలో 11 వేల మంది ఉద్యోగులపై వేటు
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీలోని మొత్తం 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని (దాదాపు 13% మందిని) తొలగిస్తున్నట్టు ప్రకటించింది
- కంపెనీ సీఈవో జుకర్బర్గ్ ప్రకటన
న్యూయార్క్, నవంబర్ 9: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీలోని మొత్తం 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని (దాదాపు 13% మందిని) తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఆదాయంలో ఒడిదొడుకులు, పారిశ్రామిక కష్టాలను అధిగమించేందుకు ఈ చర్య చేపడుతున్నట్టు మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ బుధవారం తమ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు.
కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఇతర సోషల్ మీడియా కంపెనీల మాదిరిగానే మెటా రాబడులు కూడా భారీగా పెరిగాయి. ఆ సమయంలో ఎంతో మంది ప్రజలు ఇండ్లకే పరిమితమై ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపం చేయడమే ఇందుకు కారణం. కానీ, లాక్డౌన్ ముగిసిన నాటి నుంచి జనం ఇండ్ల నుంచి బయటికి వెళ్తుండటంతో మెటా ఆదాయంలో క్షీణత మొదలైంది. దీనికి తోడు ఆర్థిక మందగమనం, ఆన్లైన్ అడ్వర్టయిజ్మెంట్లు తగ్గడంతో మెటా కష్టాలు మరింత పెరిగాయి. ఫలితంగా మెటా చరిత్రలోనే తొలిసారి ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రాబడి క్షీణించడంతోపాటు ఆ తర్వాత కూడా అదే ధోరణి కొనసాగింది. దీంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించక తప్పడం లేదని, మెటా చరిత్రలో ఇది చాలా కఠినమైన రోజని జుకర్బర్గ్ పేర్కొన్నారు. ఇకపై కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామని, అందులో భాగంగా కొంత కాలంపాటు ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తామని వివరించారు. తొలగించిన ఉద్యోగులకు జుకర్బర్గ్ క్షమాపణ చెప్పారు. వారికి 16 వారాల ప్రాథమిక వేతనాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

