డమాస్కస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ సిరియా పర్యటనలో ఉండగా మంగళవారం జరిగిన పేలుళ్లు కలకలం రేపాయి. ఆ దేశ అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో సమావేశమయ్యేందుకు డమాస్కస్‌లో ఉన్న అధ్యక్ష భవనంలోకి మక్రాన్ వెళ్లిన వెంటనే సమీపంలోని ఫోర్ సీజన్స్ హోటల్ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడగా.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు మీడియా వెల్లడించింది. గతంలో పలు దేశాలు సిరియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి పాశ్చాత్య దేశాలను ఒప్పించడంలో కీలకపాత్ర పోషించిన మక్రాన్.. అల్ షరా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆ దేశంలో కీలక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతినిధుల బృందంతో కలిసి డమాస్కస్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్లో బస చేశారు.