తిరుగుబాట్లను ప్లాన్ చేశా.. లైవ్లో అంగీకరించిన అమెరికా మాజీ భద్రతా సలహాదారు!
ఏ దేశంలో అయినా తిరుగుబాటు జరిగిందంటే ధన, ప్రాణ నష్టాలు తీవ్రంగా ఉండే అవకాశం ఎక్కువ. అందుకే సాధ్యమైనంతగా అలాంటి పరిస్థితి రాకుండానే చూసుకోవాలని అనుకుంటాయి ప్రభుత్వాలు. అయితే ప్రపంచ పెద్దన్నగా గుర్తింపు పొందిన అమెరికా మాత్రం కొన్ని దేశాల్లో ఇలాంటి తిరుగుబాట్లను ప్రోత్సహించి, వాటికి ప్లాన్లు కూడా ఇచ్చిందట.
ఈ విషయాన్ని అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టాన్ వెల్లడించారు. అగ్రరాజ్యంలో గతేడాది జనవరి 6న జరిగిన క్యాపిటోల్ ఉద్రిక్తతలకు సంబంధించి నిర్వహించిన ఒక టీవీ కార్యక్రమంలో బోల్టాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్ని దేశాల్లో తిరుగుబాట్లను ప్లాన్ చేసిన వాడిగా చెప్తున్నా.. అలా చెయ్యడానికి చాలా అంటే చాలా కష్టపడాలి’’ అని బోల్టాన్ తెలిపారు.
జనవరి 6న జరిగింది తిరుగుబాటో, ప్రజాస్వామ్యం మీద దాడో కాదని తేల్చేసిన ఆయన.. ట్రంప్ తనను తాను కాపాడుకోవడానికి, మరింత టైం సంపాదించుకోవడానికి చేసిన ప్రయత్నమని తేల్చేశారు. రిపబ్లికన్ ప్రభుత్వాల్లో చాలా కాలంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన బోల్టాన్.. 1980లలో రొనాల్డ్ రీగన్ ప్రభుత్వంలో అమెరికా న్యాయశాఖలో కీలక పదవిలో ఉన్నారు.
అలాగే జార్జ్ బుష్ టైంలో ఐక్యరాజ్య సమితిలో యూఎస్ రాయబారి సేవలందించారు. చివరగా 2018 నుంచి 2019 వరకు జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఇరాక్పై అమెరికా దాడులతోపాటు ఇరాన్, ఉత్తర కొరియాలపై బాంబులు వేయాలని చాలా బలంగా వాదించడంతో.. అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఆయన్ను పదవి నుంచి తప్పించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

