న్యూయార్క్, జూలై 13: స్వచ్ఛమైన గాలి పీల్చినవాళ్లకు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నదని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. వీరు అమెరికాలో 15 ఏండ్లపాటు పరిశోధనలు చేశారు. ముఖ్యంగా కార్ల నుంచి వెలువడే నైట్రోజన్ డై ఆక్సైడ్ (ఎన్వో2) వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నదని తెలిపారు.
అమెరికాలో స్టాండర్డ్ ఎన్వో2 లెవెల్ 100 పార్ట్స్ పర్ బిలియన్ (పీపీబీ) ఇంతకన్నా తక్కువ పీపీబీ ఉన్న గాలి పీల్చినవారికి కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నదని వెల్లడించారు. ఇక, కాలుష్యం అధికంగా ఉన్న గాలి పీలిస్తే 60 నిమిషాల్లో కుప్పకూలిపోవటం ఖాయమని తెలిపారు.