ఆహారం, మందులు నిల్వ చేసుకోండి
‘అణుయుద్ధం వచ్చే అవకాశం ఉన్నది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ తమ పౌరులను ఐరోపా దేశాలు అప్రమత్తం చేస్తున్నాయి.
- అణు యుద్ధం వచ్చే అవకాశం
- ప్రజలను సిద్ధం చేస్తున్న ఐరోపా దేశాలు
స్టాక్‌హోమ్, నవంబర్ 19: ‘అణుయుద్ధం వచ్చే అవకాశం ఉన్నది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ తమ పౌరులను ఐరోపా దేశాలు అప్రమత్తం చేస్తున్నాయి. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించడం, దీనిని స్పందన తమ అణువిధానాన్ని రష్యా మార్చుకోవడంతో ఐరోపాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో యుద్ధమే సంభవిస్తే ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలను స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ వంటి దేశాలు ప్రజలకు వివరిస్తున్నాయి.
ఈ మేరకు స్వీడన్, నార్వే పాంప్లెట్లను పంపిణీ చేస్తుండగా, ఫిన్లాండ్ ఒక ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది. అణుదాడి సహా అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున నిత్యావసర వస్తువులు, మంచినీరు, ఔషధాలను నిల్వ చేసుకోవాలని ప్రజలకు డెన్మార్క్ ఈమెయిళ్లు పంపించింది. ఐయోడిన్ ట్యాబ్లెట్లు, సులువుగా వండుకునే ఆహారం, పెంపుడు జంతువులకు ఆహారం నిల్వ చేసుకోవాలని, బ్యాకప్ విద్యుత్తు సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని ఫిన్లాండ్ సూచించింది. ఆలుగడ్డలు, క్యాబేజ్, క్యారెట్, గుడ్లు వంటి నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని ప్రజలను స్వీడన్ కోరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

