Erupted Valcanoes | ఇండోనేషియా, హవాయిలలో బద్దలైన అగ్నిపర్వతాలు
Erupted Valcanoes | ఇండోనేషియా, హవాయిలలో అగ్నిపర్వతాలు బద్దలై పెద్ద ఎత్తున లావాను ఎగజిమ్ముతున్నాయి. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సునామీ అవకాశమున్నదని జపాన్ హెచ్చరించింది.
Erupted Valcanoes | ఇండోనేషియా, హవాయిలలో అగ్నిపర్వాతాలు బద్దలయ్యాయి. జావా ద్వీపంలో ఆదివారం ఉదయం ఒక అగ్నిపర్వతం బద్దలవగా.. హవాయి దీవిలో ఉన్న మౌనా లోవా గత వారం రోజులుగా పెద్ద ఎత్తున లావా ఎగజిమ్ముతున్నది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ఆయా ప్రభుత్వాలు చేపట్టాయి.
జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది. కిలోమీటరున్నర మేర బూడిద గాలిలోకి ఎగిసిపడింది. విస్పోటనం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అగ్నిపర్వతం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల లోపు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఈ అగ్నిపర్వత విస్పోటనం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నదని జపాన్ హెచ్చరించింది.
హవాయి దీవిలోని మౌనా లోవా నుంచి తీవ్రంగా వాల్కనో విరజిమ్ముతున్నది. నవంబర్ 27 నుంచి విస్పోటనం చెందుతున్నది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ లావా ప్రవాహం, బూడిదతో నిండిపోయాయి. దాదాపు 20 నుంచి 25 అడుగుల ఎత్తువరకు లావాఎగిసిపడుతున్నది. లావా ప్రవాహం గంటకు దాదాపు 200 అడుగుల వేగంతో ఈశాన్య దిశలో ముందుకు సాగుతున్నదని హవాయి అధికారులు తెలిపారు. 1984 తర్వాత మౌనా లోవా నుంచి పెద్ద ఎత్తున లావా వెలువడటం ఇదే తొలిసారి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

