వాషింగ్టన్: తనకు సొంతిల్లు లేదని, స్నేహితుల ఇండ్లల్లోనే పడుకొంటానని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలా న్ మస్క్ తెలిపారు. టెస్లాలో పనిచేసే ఇంజినీర్ల బృందంలో తనకు చాలామంది మిత్రులు ఉన్నారని, రాత్రిళ్లు వాళ్ల ఇండ్లల్లోని ఖాళీ గదుల్లోనే నిద్రిస్తానని పేర్కొన్నారు.
విహారానికి వెళ్లడానికి తన వద్ద షిప్ కూడా లేదని తెలిపారు. అయితే తనకు సొంత విమానం ఉన్నదని, ప్రయాణాల్లో సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే దాన్ని కొన్నట్టు పేర్కొన్నారు. ఫోర్బ్స్ తాజా జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మస్క్ నిలిచారు.