Eiffel Tower : ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు.. సందర్శకులను ఖాళీ చేయించిన పోలీసులు
Eiffel Tower | ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ సందర్శనీయ ప్రదేశమైన ఈఫిల్ టవర్ (Eiffel Tower) లో బాంబు ఉన్నట్లు శనివారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈఫిల్ టవర్ మూడు అంతస్తుల్లో ఉన్న సందర్శకులను ఫ్రాన్స్ పోలీసులు ఖాళీ చేయించారు.
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ సందర్శనీయ ప్రదేశమైన ఈఫిల్ టవర్ (Eiffel Tower) లో బాంబు ఉన్నట్లు శనివారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈఫిల్ టవర్ మూడు అంతస్తుల్లో ఉన్న సందర్శకులను ఫ్రాన్స్ పోలీసులు ఖాళీ చేయించారు. టవర్ పైన ఉన్న రెస్టారెంట్‌లోని వారిని కూడా అక్కడి నుంచి పంపేశారు. అనంతరం బాంబు స్క్వాడ్, పోలీసులు కలిసి ఈఫిల్ టవర్ అంతటా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి సందర్శకులను అనుమతించలేదు.
కాగా, ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన ఈఫిల్ టవర్ నిర్మాణ పనులు 1887లో ప్రారంభమయ్యాయి. 1889 మార్చి 31న దీని నిర్మాణం పూర్తయ్యింది. ఆ ఏడాదిలో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ ఫెయిర్ సందర్భంగా ఈఫిల్ టవర్‌ను సుమారు 20 లక్షల మంది సందర్శించారు. గత ఏడాది 62 లక్షల మంది దీనిని చూసేందుకు అక్కడకు వెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

