ebay | ‘ఈబే’లో 1000 మంది ఉద్యోగులపై వేటు.. కారణం అదేనని ప్రకటన
కాలిఫోర్నియాకు చెందిన మల్టీనేషనల్ ఆన్లైన్ రిటైల్ కంపెనీ ‘ఈబే’ పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపునకు తెరలేపింది. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగుల వేతనాల బిల్లు, కంపెనీ వ్యవహారాల ఖర్చు.. వ్యాపారానికి మించి ఉండటం, మరోవైపు ఆర్థికమాంద్యం పరిస్థితుల కారణంగా లే ఆఫ్ ప్రకటించక తప్పటం లేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ebay | లండన్, జనవరి 24: కాలిఫోర్నియాకు చెందిన మల్టీనేషనల్ ఆన్లైన్ రిటైల్ కంపెనీ ‘ఈబే’ పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపునకు తెరలేపింది. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగుల వేతనాల బిల్లు, కంపెనీ వ్యవహారాల ఖర్చు.. వ్యాపారానికి మించి ఉండటం, మరోవైపు ఆర్థికమాంద్యం పరిస్థితుల కారణంగా లే ఆఫ్ ప్రకటించక తప్పటం లేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మేరకు కంపెనీ సీఈవో జామి లాన్నోన్ నుంచి సంస్థ ఉద్యోగులకు సందేశాలు వెళ్లాయి. జూమ్ కాల్స్‌లో ఆయా ఉద్యోగులకు లే ఆఫ్ సమాచారాన్ని టీమ్ లీడర్లు, వివిధ విభాగాల బాస్‌లు అందజేస్తున్నారని లాన్నోన్ చెప్పారు. కొవిడ్-19 సంక్షోభం సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆన్లైన్ లావాదేవీలు జరిపారు. దీంతో ఆయా టెక్ కంపెనీలు తమ సిబ్బందిని పెంచాయి. ఇప్పుడు తమ లాభాల మార్జిన్‌ను పెంచుకునేందుకు గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్ .. కంపెనీలు లే ఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే వాయిస్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వందల మందిని గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

