Turkey Earthquake | కొనసాగుతున్న మృత్యుఘోష.. 16వేలు దాటిన మృతుల సంఖ్య..!
తుర్కియే, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 16,000వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
Turkey Earthquake | తుర్కియే, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 16,000వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.
మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని 24 దేశాలకు చెందిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. తుర్కియేలో భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు శిథిలాల కింద వేల మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెస్క్యూ ఆపరేషన్స్‌కు ఆటంకం..
భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం సహాయక చర్యలకు వాతావరణం అనుకూలించట్లేదని స్థానిక అధికారులు వెల్లడించారు. రెండు దేశాల్లో గడ్డకట్టే వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతోందని అధికారులు తెలిపారు. టర్కీ అధ్యక్షుడు భూకంప ప్రభావిత ప్రాంతానికి చేరుకుని.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

