Dubai Princess | ఇన్స్టాగ్రామ్ వేదికగా భర్తకు తలాక్ ఇచ్చిన దుబాయి యువరాణి షైకా..!
Dubai Princess | దుబాయి యువరాణి షైఖా మహ్రా మహ్మద్ రషీద్ అల్ మక్తూమ్ తన భర్తకు విడాకులిచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా యువరాణి తన భర్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్‌తో విడిపోతున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ జంట తొలి బిడ్డకు జన్మనించిన రెండు నెలలకే విడిపోవడం గమనార్హం
Dubai Princess | దుబాయి యువరాణి షైఖా మహ్రా మహ్మద్ రషీద్ అల్ మక్తూమ్ తన భర్తకు విడాకులిచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా యువరాణి తన భర్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్‌తో విడిపోతున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ జంట తొలి బిడ్డకు జన్మనించిన రెండు నెలలకే విడిపోవడం గమనార్హం. ఇన్‌స్టా పోస్ట్‌లో ‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే మీ నుంచి విడాకులు తీసుకుంటున్నాను. టేక్ కేర్.. ఇట్లు.. మీ మాజీ భార్య’ అంటూ షైఖా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను సైతం అకౌంట్ల నుంచి తొలగించారు.

దుబాయి పాలకుడైన షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె అయిన యువరాణి షైకా.. దుబాయికి చెందిన వ్యాపారవేత్త, కుబేరుడైన షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ను 2023 మే 27న వివాహం చేసుకున్నారు. రెండునెలల కిందట షైకా, మనా దంపతులకు కూతురు జన్మించింది. ఇంతలోనే విడాకులు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. షైకా బ్రిటన్‌లోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదివారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో స్పెషలైజేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. భర్తతో విడిపోయిన షైకాకు పలువురు మద్దతుగా సందేశాలు వెల్లువెత్తాయి. షైకా గత జూన్‌లో ఇన్‌స్టా పోస్ట్‌లో ‘మనం ఇద్దరం మాత్రమే’ అంటూ కూతురుతో ఉన్న ఫొటోను షేర్ చేయడం ప్రస్తావనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

