భవనాలు కట్టే డ్రోన్!
సివిల్ ఇంజినీరింగ్ రంగంలో సరికొత్త అధ్యాయానికి శాస్త్రవేత్తలు తెరలేశారు. భవనాలు నిర్మించేందుకు డ్రోన్ ఆధారిత 3డీ ప్రింటర్‌ను రూపొందించారు. అవి గాలిలో చక్కర్లు కొడుతూనే సిమెంట్, ఇటుక, కంకర వంటి పదార్థాలను సరైన ప్రాంతంలో వేస్తూ, అవి కొలతలకు తగ్గట్టు ఉన్నాయో
లండన్, సెప్టెంబర్ 23: సివిల్ ఇంజినీరింగ్ రంగంలో సరికొత్త అధ్యాయానికి శాస్త్రవేత్తలు తెరలేశారు. భవనాలు నిర్మించేందుకు డ్రోన్ ఆధారిత 3డీ ప్రింటర్‌ను రూపొందించారు. అవి గాలిలో చక్కర్లు కొడుతూనే సిమెంట్, ఇటుక, కంకర వంటి పదార్థాలను సరైన ప్రాంతంలో వేస్తూ, అవి కొలతలకు తగ్గట్టు ఉన్నాయో, లేదో తనిఖీ చేస్తూ ఎత్తైన భవనాలను నిర్మిస్తాయి. దీన్ని లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్, స్విట్జర్లాండ్‌కు చెందిన ఎంపా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
ఈ ప్రాజెక్టు కోసం శాస్త్రవేత్తలు 3డీ ప్రింటింగ్, పాత్ ప్లానింగ్ ఫ్రేమ్ వర్క్ టెక్నాలజీలను వాడారు. ప్రాజెక్టులో రెండు డ్రోన్లు ఉంటాయి. ఒక డ్రోన్.. నిర్మాణ పదార్థాలతో గోడలు కట్టేదాన్ని బిల్ డ్రోన్ అంటారు. ఇంకో డ్రోన్.. బిల్ డ్రోన్ కట్టే నిర్మాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తుంది. దీని పేరు స్కాన్ డ్రోన్. ఈ రెండు డ్రోన్ల సహాయంతో 3డీ ప్రింటర్‌ను ఉపయోగించి ఇన్సులేషన్ ఫోమ్‌తో 72 లేయర్లతో, 2 మీటర్ల ఎత్తు వరకు ఒక స్థూపాకారాన్ని శాస్త్రవేత్తలు నిర్మించారు. అననుకూల ప్రాంతాల్లో భవనాల నిర్మాణానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- construction
- drones
- sector
- useful
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

