మాంట్రియాల్ : కెనడాలో ఎండలు మండుతున్నాయి. అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో 230 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఒక్క వాంకోవర్ ప్రాంతంలో గత శుక్రవారం నుంచి సుమారు 130 మంది మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువ శాతం మంది వృద్ధులు ఉన్నారు. అధిక స్థాయిలో ఉష్ణోగ్రతులు నమోదు కావడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో టెంపరేచర్లు నమోదు అయ్యాయి. లిట్టన్ నగరంలో అత్యధికంగా 49.5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. గతంలో ఎన్నడు కూడా కెనడాలో ఉష్ణోగ్రతలు 45సీ దాటలేదు. నార్త్‌వెస్ట్ అమెరికా, వెస్ట్ కెనడా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వాంకోవర్‌లో గతంలో ఎప్పుడూ ఇలాంటి హీట్‌వేవ్ లేదని, దాని వల్లే డజన్ల సంఖ్యలో జనం చనిపోతున్నట్లు పోలీసు సర్జెంట్ స్టీవ్ అడిసన్ తెలిపారు. బర్నబే ప్రాంతంలో 34 మంది చనిపోయారు.