‘ఐవర్‌మెక్టిన్’ వద్దు!

న్యూఢిల్లీ, మే 10: యాంటీ పారసైటిక్ ఔషధం ‘ఐవర్‌మెక్టిన్’ను క్రమం తప్పకుండా వాడటం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చన్న వార్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తోసిపుచ్చింది. క్లినికల్ ట్రయల్స్ కోసం మినహా ఈ ఔషధాన్ని వాడొద్దని సూచించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ మంగళవారం ట్వీట్ చేశారు. ‘ఏదైనా ఔషధాన్ని వాడుతున్నామంటే రక్షణ, సమర్థత అనేది ముఖ్యం. క్లినికల్ ట్రయల్స్ మినహాయించి కొవిడ్-19 చికిత్సకు ‘ఐవర్‌మెక్టిన్’ను వాడొద్దు’ అని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. కాగా ‘ఐవర్‌మెక్టిన్’ను తరుచూ వినియోగించడం వల్ల కొవిడ్-19 బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గించవచ్చని అమెరికాకు చెందిన ఫ్రంట్‌లైన్ కొవిడ్-19 క్రిటికల్ కేర్ అలియన్స్ (ఎఫ్ఎల్సీసీసీ) పరిశోధకులు సోమవారం పేర్కొనడం తెలిసిందే. ‘ఐవర్‌మెక్టిన్’ వాడటం ద్వారా కరోనాని సమూలంగా అంతం చేయవచ్చని వాళ్లు తెలిపారు. దీంతో 18 ఏండ్లు దాటిన వారందరూ ‘ఐవర్‌మెక్టిన్’ వాడొచ్చని గోవా సర్కార్ సోమవారం సూచించింది. ఈ డ్రగ్‌ను వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- corona
- Ivermectin
- WHO
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

