Donald Trump | ఇరాన్ ప్రతిపాదనలపై సమీక్షిస్తా.. దూకుడుగా వ్యవహరిస్తే మళ్లీ దాడులు తప్పవు.. ట్రంప్ హెచ్చరిక
Donald Trump : అమెరికాతో చర్చల అంశంపై ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనలనకు సమీక్షిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో తాను యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నానని చెప్పాడు.
Donald Trump : అమెరికాతో చర్చల అంశంపై ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనలనకు సమీక్షిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో తాను యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నానని చెప్పాడు. ఈ అంశంపై శనివారం తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్‌లో ప్రకటన చేశారు. ఇరాన్ తాజాగా చేసిన ప్రతిపాదనలపై సమీక్షిస్తున్నట్లు, అయితే, వాటిని అంగీకరిస్తానో లేదో తెలియదన్నారు.
అయినప్పటికీ ఇరాన్‌పై సైనిక చర్యకు ఇంకా అవకాశాలున్నాయని ట్రంప్ చెప్పారు. అయితే, 47 ఏళ్లుగా ప్రపంచానికి, మానవజాతికి ఇరాన్ చేసిన దానికి ఆ దేశం ఇంకా పరిహారం చెల్లించుకోలేదని ట్రంప్ అన్నారు. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినా, తప్పుగా ప్రవర్తించినా మరోసారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాజాగా అమెరికాకు ఇరాన్.. 14 అంశాలతో నూతన ప్రతిపాదనలు పంపింది. పాకిస్తాన్ ద్వారా తమ సమాచారాన్ని చేరవేసింది. ఈ అంశంలో నిర్ణయం అమెరికా చేతిలోనే ఉందని ఇరాన్ తెలిపింది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే, తమ సైన్యం ఎలాంటి చర్యకైనా సిద్ధంగానే ఉందని వెల్లడించింది.
అయితే, అంతకుముందు అమెరికా కూడా ఇరాన్‌కు తొమ్మిది అంశాలతో ప్రతిపాదనలు పంపింది. ఇరాన్‌కు సంబంధించి తమకు ఆర్థిక వెసలుబాట్లు కల్పించాలని ఆ దేశం కోరుకుంటోంది. అణు ఒప్పందంతో సంబంధం లేకుండా ప్రపంచ వాణిజ్యంలో, చమురు సరఫరాలో స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతోంది. అలాగే, తాము స్వేచ్ఛగా యురేనియం శుద్ధి చేసి, అణు హక్కును కలిగి ఉంటామని, ఇందుకు సహకరించాలని కోరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- economic
- iran
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

